మరోసారి లక్ష దాటిన కేసులు

By udayam on April 7th / 6:53 am IST

పాత రికార్డులను చెరిపేస్తూ ఈరోజు భారత్​లో కరోనా కేసులు కొత్త శిఖరాలకు చేరాయి. 24 గంటల్లో ఏకంగా 1,15,736 కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య ఇప్పటి వరకూ దేశంలో ఒకరోజు నమోదైన అత్యధిక కేసులు కావడం గమనార్హం. సోమవారం నాడు తొలిసారిగా లక్ష దాటిన కేసులు నిన్నటి రోజున 97 వేలకు పరిమితమయ్యాయి. బుధవారం నాటికి ఈ సంఖ్య 1.15 లక్షలకు చేరుకుని ముందు ముందు రోజుల్ని మరింత ప్రమాదంలోకి నెట్టేశాయి. దాంతో పాటు ఒకరోజు వ్యవధిలో 630 మంది ఈ మహమ్మారికి బలయ్యారు.

ట్యాగ్స్​