జులై వరకూ వాక్సిన్​ కొరతే : పూనావాలా

By udayam on May 3rd / 6:50 am IST

ఈ ఏడాది జులై వరకూ వ్యాక్సిన్​ కొరత ఉంటుందని సీరమ్​ ఇన్​స్టిట్యూట్​ అధినేత అదర్​ పూనావాలా వెల్లడించారు. రోజుకు 3 లక్షల వరకూ కేసులు నమోదవడంతో పాటు 3వ దశ కరోనా వ్యాక్సినేషన్​కు డోసులు కరువైన వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జులై తర్వాత వ్యాక్సిన్​ ప్రొడక్షన్​ పుంజుకుంటుందని తెలిపారు. అప్పటి నుంచి నెలకు 60–70 మిలియన్ల డోసుల నుంచి 100 మిలియన్​ డోసుల వరకూ వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

ట్యాగ్స్​