భారత్​ 8.5 శాతం వృద్ధి సాధిస్తుంది

అంచనాలను సవరించిన బార్​క్లేస్​ సంస్థ

By udayam on November 20th / 8:40 am IST

కొవిడ్​–19 లాక్​డౌన్​ అనంతరం భారత్​ ప్రపంచ దేశాలతో పోల్చితే ఆర్ధిక వృద్ధి విషయంలో గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తోందని ప్రముఖ ఫైనాన్షియల్​ ఎనలిస్ట్​ కంపెనీ బార్​క్లేస్​ అంచనా వేసింది.

దీంతో 2022లో భారత్​ వృద్ధి రేటు ముందుగా అంచనా వేసిన 7 శాతాన్ని దాటి 8.5 శాతంగా నమోదవుతుందని ఆ సంస్థ నివేదికలో వెల్లడించింది.

‘‘ఇప్పటికే వ్యాక్సిన్​ అవకాశాలు 90 శాతం మెరుగయ్యాయి. దాంతో పాటు ఇక్కడి ప్రజల్లో హెర్ఢ్ ఇమ్యూనిటీ స్థాయి కూడా పెరిగింది. కాబట్టి ఇక్కడి ఆర్ధిక పరిస్థితి కొవిడ్​ కు ముందు రోజుల్ని అందుకుని దూసుకుపోతుందడనంలో ఎలాంటి సందేహం మాకు లేదు” అని బార్​క్లేస్​ అభిప్రాయపడింది.

ఇప్పటికే దేశంలోని అతి పెద్ద ఆటోమొబైల్​ సంస్థ అయిన హీరో మోటోకార్ప్​తో పాటు జ్యూయలరీ కంపెనీ అయిన టైటాన్​ కంపెనీ సైతం అత్యధిక అమ్మకాల స్థాయికి చేరుకోవడం కూడా మేం గమనించాం అని బార్​క్లేస్​ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

అయితే ఈ ఏడాది వృద్ధి రేటును మైనస్​ 6 శాతంగా ముందుగా అభిప్రాయపడినా మారుతున్న పరిస్థితుల దృష్ట్యా దానికి 6 శాతానికి సవరిస్తున్నట్లు తెలిపారు.