భారీగా తగ్గిన భారత ఎగుమతులు

By udayam on January 18th / 4:44 am IST

అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం భయాలు దేశీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా వివిధ దేశాలు సరుకుల దిగుమతులపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఫలితంగా భారత్‌ ఎగుమతులు గణనీయంగా తగ్గాయి. దీంతో వాణిజ్యలోటు పెరుగుతోంది. సేవారంగంతో కలిపి వాణిజ్య ఎగుమతులు 2021 డిసెంబర్‌ నెలలో 65.25 బిలియన్‌ డాలర్ల మేర వివిధ దేశాలకు మన దేశం నుండి ఎగుమతులు జరిగాయి. 2022 డిసెంబర్‌లో ఈ మొత్తం 61.82 బిలియన్‌డాలర్లకు పడిపోయింది. ఇంజినీరింగ్‌, వజ్రాలు, ఆభరణాలు, పత్తి, కార్పెట్స్‌, ప్లాస్టిక్‌, లినోలియమ్‌ ఉత్పత్తులకు సంబంధించిన ఎగుమతుల్లో గణనీయ తగ్గుదల కనిపించింది.

ట్యాగ్స్​