ఐఎంఎఫ్​: 2029 నాటికి 5 ట్రిలియన్ల జిడిపి

By udayam on May 4th / 6:25 am IST

భారత జిడిపి 2029 ఆర్ధిక సంవత్సరం నాటికి 5 ట్రిలియన్ల మార్క్​ను చేరుకుంటుందని ఐఎంఎఫ్​ అంచనా వేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2025 నాటికల్లా 5 ట్రిలియన్ల జిడిపి సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఐఎంఎఫ్​ మాత్రం ఆ లక్ష్యం 2029 కే సాధ్యమవుతుందని పేర్కొంటోంది. 2028 నాటికి భారత జిడిపి 4.92 ట్రిలియన్​ డాలర్లకు చేరుకుంటుందని, మరుసటి ఏడాదికి 5 ట్రిలియన్​ డాలర్లను దాటుతుందని పేర్కొంది. 2029 నాటికి డాలర్​తో రూపాయి మారకం విలువ రూ.94కు చేరుతుందని పేర్కొంది.

ట్యాగ్స్​