భారత్‌కు చెందిన టెలి కమ్యూనికేషన్ శాటిలైట్ జిశాట్–24 విజయవంతమైంది. ఫ్రెంచ్ గుయానా లోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్ స్పేస్ రాకెట్లో బయల్దేరిన ఈ ఉపగ్రహం తన కక్ష్యలోకి విజయవంతంగా చేరింది. ఇస్రో తయారు చేసిన ఈ ఉపగ్రహం బరువు 4,184 కేజీలు. 24–కెయు బ్యాండ్ కమ్యూనియేషన్ శాటిలైట్‌ను డిటిహెచ్ సేవల కోసం భారత్ ఉపయోగిస్తోంది. ఈ శాటిలైట్‌ను టాటా ప్లే సంస్థకు భారత్ లీజుకు ఇచ్చింది.