భారత అత్యంత సుదీర్ఘ ఇన్నింగ్స్​ ఇదే

నాలుగో ఇన్నింగ్స్​లో ఎక్కువ ఓవర్లు ఆడింది సిడ్నీలోనే

By udayam on January 12th / 9:26 am IST

ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన మూడో టెస్ట్​లో భారత్​ అరుదైన ఘనతను సాధించింది. ఏకంగా 131 ఓవర్ల పాటు బ్యాటింగ్​ చేసి డ్రా చేసుకున్న భారత్​.. నాలుగో ఇన్నింగ్స్​లో అత్యధిక ఓవర్లు ఆడడం ఇదే తొలిసారి.

అంతకు ముందు 1979లో సైతం సరిగ్గా 131 ఓవర్ల పాటు ఢిల్లీలో పాకిస్థాన్​పై నాలుగో ఇన్నింగ్స్​లో బ్యాటింగ్​ చేసిన భారత్​ 364/6తో నిలిచి మ్యాచ్​ను డ్రా చేసుకుంది.

2002లో లార్డ్స్​ మైదానంలో ఇంగ్లాండ్​పై 109.4 ఓవర్ల పాటు నాలుగో ఇన్నింగ్స్​లో బ్యాటింగ్​ చేసి 397 పరుగులు చేసి ఆలౌట్​ అయిన భారత్​ ఆ మ్యాచ్​లో ఓటమి చెందింది.

1992లో అడిలైడ్​ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో నాలుగో ఇన్నింగ్స్​లో 100.1 ఓవర్లపాటు బ్యాటింగ్​ చేసిన భారత్​ 333 పరుగులకు ఆలౌట్​ అయి మ్యాచ్​ను ఓడిపోయింది.

1997 లో కొలంబోలో శ్రీలంకపై 100 ఓవర్ల పాటు నాలుగో ఇన్నింగ్స్​లో బ్యాటింగ్​ చేసిన భారత్​ 281 పరుగులు చేసి మ్యాచ్​ను డ్రాగా ముగించింది. ఆ మ్యాచ్​లో కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయింది.