25న నెట్‌ఫ్లిక్స్‌లోకి ‘ఛెల్లో షో’

By udayam on November 22nd / 1:17 pm IST

భారత్​ తరపున ఈ ఏడాది ఆస్కార్​ అవార్డ్​ రేసుకు ఎంపికైన మూవీ ‘ఛెల్లో షో’ త్వరలో ఓటీటీలోనూ సందడి చేయనుంది. దర్శకుడు నలిన్‌ రూపొందించిన ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ లో నవంబర్‌ 25న ప్రేక్షకులను అలరించనుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ నలిన్ నెట్‌ఫ్లిక్స్‌కు థ్యాంక్స్ తెలిపారు. ఛెల్లో షో అనేది సినిమా కాదు.. ఒక వేడుక అని చెప్పారు. ఇప్పుడు ఈ వేడుకను భారతదేశంలోని ప్రజలందరూ చేసుకోనున్నారంటూ ఆనందం వ్యక్తం చేశారు. అక్టోబర్ 14న రిలీజై.. బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌’ కేటగిరీలో ఆస్కార్‌కు ఎంపికైన ఛెల్లో షో.. దర్శకుడు నలిన్‌ బాల్య జ్ఞాపకాల ఆధారంగా తెరకెక్కించారు.

ట్యాగ్స్​