భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఎంత పెద్దదో ప్రపంచం మొత్తానికి తెలుసు. అయితే ఇదే దేశంలో రీఫర్బిష్డ్ (అంటే వాడుతూ పాడైన ఫోన్లను తిరిగి బాగు చేసి అమ్మే బిజినెస్) బిజినెస్ 11 బిలియన్ల మార్క్‌కు చేరుకోనుంది. క్యాఫిఫై, హైపర్ఎక్స్చేంజ్, యాంత్రా వంటి సంస్థల కారణంగా ఈ బిజినెస్ బూమ్‌లో కొనసాగుతోంది. 2026 నాటికి దేశంలో రూ.82 వేల కోట్లకు పైగా రీఫర్బిష్డ్ ఫోన్ల అమ్మకాలు జరుగుతాయని అంచనా.