నేటి నుంచే భారత్​, న్యూజిలాండ్​ టి20 సిరీస్​

By udayam on November 18th / 5:04 am IST

భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మూడు టి20ల సిరీస్‌ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఇరుజట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌కు వెల్లింగ్టన్‌ ఆతిథ్యమివ్వనుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మ్యాచ్​ ప్రారంభం కానుంది. సీనియర్‌ క్రికెటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, బుమ్రా, షమీ, దినేశ్‌ కార్తీక్‌లకు విశ్రాంతినివ్వడంతో యువ క్రికెటర్లతో టీమిండియా బరిలోకి దిగుతోంది. హార్దిక్‌ పాండ్యా కెప్టెన్‌గా, రిషభ్‌ పంత్‌ను వైస్‌ కెప్టెన్‌గా బిసిసిఐ ఎంపిక చేసింది. ఈ సిరీస్​ ను ఓటిటి ప్లాట్​ ఫాం అమెజాన్​ ప్రైమ్​ లో స్ట్రీమింగ్​ చేయనున్నారు.

ట్యాగ్స్​