భారత్ ఒకే రోజు రెండు స్వదేశీ యుద్ధ నౌకల్ని నేవీలోకి కమిషన్ చేయనుంది. మంగళవారం జరగనున్న ఈ కార్యక్రమంలో 15 బి డిస్ట్రాయర్ కేటగిరీలో నిర్మించిన సూరత్, 17ఎ ఫ్రిగేట్ ప్రాజెక్ట్‌లో నిర్మించిన ఉదయగిరి యుద్ధ నౌకల్ని మంగళవారం నేవీలోకి ప్రవేశపెట్టనున్నారు. వీటిని ముంబైలోని మజగావూన్ డాక్ లిమిటెడ్‌లో దేశీయంగా అభివృద్ధి చేశారు. నెక్స్ట్ జనరేషన్ స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్స్గా వీటిని నేవీ పిలవనుంది.