ప్రత్యేక అవసరాలున్న ఓ దివ్యాంగురాలిని విమానంలో ప్రయాణించకుండా ఇండిగో సిబ్బంది వ్యవహరించారన్న వార్తలపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి సింథియా ఫైర్ అయ్యారు. ఈ విషయంపై తానే స్వయంగా దర్యాప్తుకు దిగుతున్నట్లు చెప్పారు. రాంచీ విమానాశ్రయం నుంచి కుటుంబంతో కలిపి ఓ దివ్యాంగ చిన్నారి హైదరాబాద్ వెళ్ళేందుకు ఫ్లైట్ ఎక్కుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారి భయపడుతున్నాడని, దాంతో ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందనే ఫ్లైట్ ఎక్కనివ్వలేదని ఇండిగో వివరించింది.