ఇండోనేషియా: సహజీవనం చేస్తే ఆరు నెలల జైలు..

By udayam on December 7th / 5:55 am IST

వివాహేతర సంబంధాలు, సహజీవనంపై ఇండోనేసియా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ రెండింటినీ నిషేధిస్తూ తీసుకొచ్చిన బిల్లుకు నిన్న పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఈ కొత్త చట్టం ప్రకారం వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణిస్తారు. ఉల్లంఘిస్తే ఏడాది జైలు శిక్ష విధిస్తారు. అలాగే, పెళ్లి చేసుకోకుండా కలిసి ఉంటే (సహజీవనం) ఆరు నెలల జైలు శిక్ష తప్పదు. ఈ కొత్త బిల్లుకు అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయి. అయితే, ప్రభుత్వం తీసుకున్నఈ నిర్ణయంపై దేశంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ట్యాగ్స్​