ఇండోనేషియాలో గత శనివారం సముద్రంలో కూలిపోయిన బోయింగ్ ఎస్‌జె 182 విమానంలోని బ్లాక్ బాక్స్‌ను అక్కడి నావికా సిబ్బంది ఎట్టకేలకు కనిపెట్టారు.
ఈ విషయాన్ని అక్కడి స్థానిక జాతీయ టివిలో వెల్లడించారు. బ్లాక్ బాక్స్‌కు సంబంధించిన చిత్రాలతో పాటు సముద్రం అడుగు భాగంలో తుక్కులా మారిన విమాన శకలాలను సైతం అక్కడి ప్రసార సాధనాల్లో ప్రసారం చేస్తున్నారు.
లభ్యమైన బ్లాక్ బాక్స్‌ను జకార్తా పోర్ట్‌కు తరలించినట్లు ఆ దేశ విమానయాన శాఖ అధికారులు తెలిపారు.