పామాయిల్​పై ఇండోనేషియా తీపికబురు

By udayam on May 23rd / 8:19 am IST

పామాయిల్​ ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఇండోనేషియా ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్​ 28 నుంచి అంటే గత మూడు వారాల నుంచి ఈ దేశం పామాయిల్​ ఎగుమతులపై నిషేధం విధించడంతో భారత్​తో పాటు పలు దేశాల్లో దీని ధర ఆకాశాన్ని తాకింది. సోమవారం నుంచి ఈ నిషేధాన్ని ఎత్తేస్తున్నామని, తిరిగి ప్రపంచ మార్కెట్​కు సరఫరా చేస్తున్నట్లు ఇండోనేషియా పేర్కొంది. కొత్త నిబంధనల వల్ల వీటి ఎగుమతులు ఇప్పుడప్పుడే మొదలయ్యే అవకాశాలు లేవని రాయిటర్స్​ సంస్థ పేర్కొంది.

ట్యాగ్స్​