ఇండోనేషియా లో సోమవారం మధ్యాహ్నం సంభవించిన స్వల్ప భూకంపం ధాటికి మరణించిన వారి సంఖ్య 162 కు చేరింది. గంట గంటకూ మృతుల సంఖ్య, బాధితుల సంఖ్య పెరుగుతుండడం కలవర పెడుతోంది. వందలాది మంది క్షతగాత్రులకు ఆసుపత్రుల లోపల, బయట కూడా చికిత్స చేస్తున్నారు. కూలిపోయిన భవనాల కింద చిక్కుకుపోయిన వారిని కాపాడే సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మంగళవారం జావాలో 5.6 తీవ్రతతో భూమి కంపించింది.