రైలు బాత్​రూమ్​ వాష్​బేసిన్​లో పసికందు

By udayam on May 11th / 12:35 pm IST

ధన్​బాద్​–అలెప్పి ఎక్స్​ప్రెస్​ రైల్​ బాత్​రూమ్​ వాష్​బేసిన్​లో అప్పుడే పుట్టిన పసిబిడ్డను వదిలేసి తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. ఈ ట్రైన్​ విశాఖ రైల్వే స్టేషన్​కు రాగానే బీ1 బోగీ లో పసికందు ఏడుపు విని తోటి ప్రయాణికులు టాయిలెట్​ ను చెక్​ చేయగా.. అందులోని వాష్ బేసిన్​లో ఈ పసికందు కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆర్పీఎఫ్​ పోలీసులు స్టేషన్​కు చేరుకుని ప్రాథమిక పరీక్షల అనంతరం రైల్వే ఆసుపత్రికి తరలించారు. పాప తల్లిదండ్రుల కోసం వెతుకుతున్నారు.

ట్యాగ్స్​