రూ.2 కోట్లకు అమ్మేద్దామన్నారు

By udayam on July 21st / 7:21 am IST

తమ కంపెనీ ఇన్ఫోసిస్​ను 1990లో రూ.2 కోట్ల ధరకు కొనేయడానికి కొంతమంది ప్రయత్నించారని ఆ సంస్థ సిఈఓ నారాయణమూర్తి తెలిపారు. అయితే తాను ఆ మొత్తానికి ఆశపడలేదని, కంపెనీని తానే స్వయంగా నడుపుతానని తన పార్టనర్స్​తో చెప్పినట్లు తాజాగా వెల్లడించారు. 1991లో వచ్చిన ఆర్ధిక సంస్కరణలతో తమ కంపెనీ మార్కెట్​లో బలంగా నాటుకుపోయిందని, దాంతో ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదన్నారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్​ మార్కెట్​ విలువ రూ.6.5 లక్షల కోట్లు.

ట్యాగ్స్​