నాలుగో టెస్ట్​కు బుమ్రా డౌట్​

అతడి స్థానంలో నటరాజన్​కు అవకాశం!

By udayam on January 12th / 12:45 pm IST

ఇప్పటికే నాలుగో టెస్ట్​ నుంచి ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా దూరమవ్వగా ఇప్పుడు ఫాస్ట్​ బౌలర్​ బుమ్రా సైతం అదే బాట పట్టనున్నాడు.

పొట్ట భాగంలో తీవ్ర నొప్పితో జస్ప్రీత్​ బుమ్రా బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్ట్​ ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్​లో బుమ్రా ఈ బాధతో విలవిల్లాడినట్లు జట్టు వర్గాలు వెల్లడించాయి.

దీంతో ఇన్నింగ్స్​ మధ్యలో బ్రేక్​ తీసుకున్న బుమ్రా అనంతరం తిరిగి వచ్చి కొన్ని ఓవర్ల పాటు బౌలింగ్​ చేశాడు.

ఇప్పటి వరకూ మూడు టెస్టుల్లో కలిపి 117.4 ఓవర్ల పాటు బౌలింగ్​ చేసిన బుమ్రా విపరీతమైన వర్క్​ లౌడ్​ వల్ల సైతం విశ్రాంతి కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇతని గాయంపై జట్టు ఫిజియో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నాలుగో టెస్ట్​కు ఎలాగైనా అందుబాటులో ఉండేలా సిద్ధం చేస్తున్నట్లు జట్టు వర్గాలు తెలిపారు.

ఒకవేళ బుమ్రా నాలుగో టెస్ట్​కు దూరమైతే ఆస్ట్రేలియాలో టి–20లలో రాణించిన నటరాజన్​కు ఛాన్స్​ దక్కినట్లే

ఇప్పటికే కెఎల్​ రాహుల్​, ఉమేష్​ యాదవ్​, మహ్మద్​ షమి, ఇషాంత్​ శర్మ, రవీంద్ర జడేజా, విరాట్​ కోహ్లీలు జట్టుకు దూరమవ్వగా ఇప్పుడు బుమ్రా వంతు వచ్చింది.