రాకేశ్​ టికాయత్​పై సిరా దాడి

By udayam on May 30th / 10:27 am IST

రైతు సంఘాల నేత రాకేశ్​ టికాయత్​పై కర్ణాటకలో దాడి జరిగింది. బెంగళూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనపై నిరసనకారులు బ్లాక్​ సిరా చల్లారు. టికాయత్​తో పాటు మరో నేత యుద్విర్​ సింగ్​ పైనా సిరా విసిరిన నిరసనకారులు కుర్చీలతోనూ దాడి చేశారు. కర్ణాటక రైతు కొడిహల్లి చంద్రశేఖర్​ డబ్బు తీసుకుంటూ మీడియా స్టింగ్​ ఆపరేషన్​కు పట్టుబడడంతో వివరణ ఇస్తున్న క్రమంలో టికాయత్​పై ఈ దాడి జరిగింది.

ట్యాగ్స్​