4.2 తీవ్రతతో కంపించిన అరుణ గ్రహం

By udayam on September 23rd / 10:23 am IST

సౌర కుటుంబంలో భూమి తర్వాత ఉన్న అరుణ గ్రహంలోని నేల కంపించడాన్ని అక్కడి నాసా ఇన్​సైడర్​ ల్యాండర్​ గుర్తించింది. ఈ ల్యాండర్​ తిరుగుతున్న ప్రాంతంలో ఈనెల 18న 4.2 తీవ్రతతో అక్కడి నేల కంపించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమి మీద వచ్చే భూకంపాలు కొన్ని నిమిషాలు, సెకన్లు ఉంటే అరుణ గ్రహంపై ఏకంగా గంటన్నర పాటు నేల కంపించిందని ఈ ల్యాండర్​ పసిగట్టింది. ఇలా అక్కడ నేల కంపించడం గత 30 రోజుల్లో 3వ సారి అని తెలిపింది. అంతకు ముందు 3.7, 4.1 తీవ్రతతో అరుణ గ్రహం కంపించినట్లు నాసా తెలిపింది.

ట్యాగ్స్​