పాపులర్ ఫొటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ ఈరోజు సరికొత్త ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఇకపై 90 సెకండ్ల పాటు రీల్స్ వీడియోస్ తీసుకునేలా యాప్‌ను అప్డేట్ చేసింది. దీంతో పాటు యూజర్లు తమ సొంత వాయిస్‌ను సైతం రీల్స్‌కు జత చేసుకోవచ్చని పేర్కొంది. ఇందుకోసం ఇంపోర్ట్ ఆడియో ఫీచర్‌ను రీల్స్‌లో యాడ్ చేసింది. దీంతో పాటు కంటెంట్ క్రియేటర్ల కోసం ‘పోల్’ ఆప్షన్ ను సైతం ప్రవేశపెట్టింది.