ఇంటర్ పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి పరీక్షా కేంద్రం వద్ద గుండెపోటుకు గురై మరణించిన విషాద ఘటన ఎపిలోని గూడూరులో చోటు చేసుకుంది. కొమ్మవారిపల్లెకు చెందిన సతీష్ ప్రతీరోజు తన ఊరు నుంచి గూడూరు పరీక్ష కేంద్రానికి వచ్చేవాడు. ఈరోజు పరీక్ష కేంద్రం బయట కూర్చుని విపరీతంగా చెమటలు కక్కుతూ కూలిపోయాడు. దీంతో విద్యార్థులు అక్కడే ఉన్న పోలీసులకు విషయం చెప్పడంతో అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సతీష్ మృతిచెందాడని వైద్యులు ధృవీకరించారు.