ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను వచ్చే ఏడాది మార్చి 15 నుంచి నిర్వహించనున్నట్లు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పరీక్షల టైం టేబుల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఎంవి శేషగిరిబాబు సోమవారం ఒక ప్రకటన ద్వారా విడుదల చేశారు. ప్రతిఏటా ప్రాక్టికల్ పరీక్షలను పబ్లిక్ పరీక్షల కంటే ముందుగా ఇంటర్ బోర్డు నిర్వహించేది. ఈ సారి మాత్రం పబ్లిక్ పరీక్షల తరువాత నిర్వహించనుంది. ప్రాక్టికల్స్ పరీక్షలు ఏప్రిల్ 15 నుంచి 25వ తేదీ వరకు, రెండో విడత ఏప్రిల్ 30నుంచి మే 10 వరకు జరుగనున్నాయి.