ఆరు రోజుల క్రితం జరిగిన కోనసీమ అల్లర్లతో కట్ చేసిన ఇంటర్నెట్ అక్కడ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. వారం నుంచి నెట్ అందుబాటులోకి రాక అటు సామాన్యులు, వ్యాపారస్తులు సైతం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లా పేరు మార్పుపై రేగిన అల్లర్లు చల్లారినా ఇంతకాలం నెట్ అందుబాటులోకి ఇవ్వకపోవడం ఏంటంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై పోలీసులు మాత్రం ఇంటర్నెట్ నిషేధం మరిన్ని రోజులు కొనసాగుతుందని చెబుతున్నారు.