భారత్ లో తన తయారీ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు వీలుగా యాపిల్ సంస్థ మరో భారీ పెట్టుబడితో కొత్త ప్లాంట్ నిర్మాణానికి సిద్ధమవుతోంది. గ్రేటర్ నోయిడా వద్ద ఉన్న యమునా అథారిటీస్ వద్ద 23 ఎకరాల లాండ్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది. ఇందులో రూ.2800 కోట్ల వ్యయంతో నిర్మించే ప్లాంట్ లో యాపిల్ ఐఫోన్ 16 వర్షన్ నుంచి మానుఫాక్చరింగ్ తో పాటు అసెంబ్లింగ్ యూనిట్ కూడా ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం భారత్ కు చెందిన మూడు కంపెనీలతో చర్చలు జరుపుతోంది.