భారత్ లో ఐఫోన్ తయారీ బాధ్యతలను చూస్తున్న ఫాక్స్ కాన్ తమిళనాడులో తమ యూనిట్ లో పనిచే 60 వేల మంది కోసం భారీ హాస్టల్ ను నిర్మించడానికి సిద్ధమవుతోంది. చెన్నైకు సమీపంలో ఈ అతిపెద్ద హాస్టల్స్ నిర్మాణం త్వరలోనే ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం 20 ఎకరాల లాండ్ ను సిద్ధం చేసుకున్న ఫాక్స్ కాన్ కు చెన్నై యూనిట్ లో 15 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ సంఖ్యను వచ్చే 18 నెలల్లో 70 వేలకు పెంచనున్న నేపధ్యంలో వీరి బస కోసం ఈ భారీ హోటల్ నిర్మాణం చేపట్టనుంది.