ఐపిఎల్ 14వ సీజన్ కోసం వచ్చే నెల 18న మినీ వేలం నిర్వహించాలని బిసిసిఐ నిర్ణయించింది.
ఇప్పటికే అన్ని జట్లు తాము వదిలేసిన ప్లేయర్ల జాబితాను ఐపిఎల్ ఆక్షన్ కమిటీకి అందించగా.. వీరితో పాటు మరికొత మంది దేశ, విదేశీ ప్లేయర్ల పేర్లు ఈ వేలంలో ఉండనున్నాయి.
అయితే ఈ వేలంలో ఒక్కో జట్టు రూ.53.20 కోట్ల ను ఖర్చు చేయాల్సి ఉంటుందని బిసిసిఐ తెలిపింది. కేవలం 14 మంది ప్లేయర్లను మాత్రమే ఉంచుకున్న బెంగళూరు వద్ద అత్యధికంగా 35.90 కోట్లు ఉండగా, కోల్కత్తా, హైదరాబాద్ జట్ల వద్ద అత్యల్పంగా 10.75 కోట్లు మాత్రమే ఉన్నాయి.
రాజస్థాన్ వద్ద 34.85 కోట్లు ఉండడంతో ఈసారి బెంగళూరు, రాజస్థాన్‌లు ఎక్కువ మంది ప్లేయర్లను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, ఆరోన్ ఫించ్లతో పాటు పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు ఈసారి వేలానికి రానున్నారు.