ఐపిఎల్లో శుక్రవారం జరిగిన మ్యాచ్లో ధోనీ సేన ముందు బెంగళూరు జట్టు చిత్తయింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన.. దేవదత్ పడిక్కల్ (70), కోహ్లీ (53), రాణించడంతో 13 ఓవర్లకే 111 పరుగులు చేసి భారీ స్కోర్ దిశగా పయనించింది. ఆ క్రమంలో గాడిలో పడ్డ చెన్నౌ బౌలర్లు మిగతా ఆర్సీబీ ప్లేయర్లను క్రీజులో కుదురుకోనివ్వలేదు. చివరి 7 ఓవర్లలో కేవలం 45 పరుగులు మాత్రమే చేసిన ఆర్సీబీ 156 తో సరిపెట్టుకుంది. స్వల్ప లక్ష్యాన్ని చెన్నై బ్యాటర్లు ధాటిగా ఆరంభించారు. గైక్వాడ్ (38), డుప్లెసిస్ (31), రాయుడు (32) రాణించగా చెన్నై 18.1 ఓవర్లలోనే 157 పరుగులు చేసేసింది.