ఐపిఎల్​ మొత్తం ముంబైలోనే!

నాకౌట్ మ్యాచ్​లు అహ్మదాబాద్​లో

వెల్లడించిన ఢిల్లీ క్యాపిటల్స్​ యజమాని పార్థ్​ జిందాల్​

By udayam on February 20th / 11:11 am IST

వచ్చే రెండు నెలల్లో జరగనున్న ఐపిఎల్​ 14 వ సీజన్​ మ్యాచులన్నీ ముంబైలోనే జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్​ సహ యజమాని పార్థ్​ జిందాల్​ ఈఎస్​పిఎన్​ క్రిక్​ ఇన్ఫోతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ ఏడాది ఐపిఎల్​ భారత్​లోనే జరగనుంది. విదేశీ క్రికెట్ జట్లు ప్రస్తుతం భారత్​కు రావడానికి ఎలాంటి అడ్డూ చెప్పవు. కాబట్టి లీగ్​ మొత్తాన్ని ఒకే స్టేడియంలో నిర్వహించవచ్చు. నాకౌట్​ మ్యాచ్​లకు వేరొక స్టేడియానికి మార్చవచ్చు. ఇప్పటి వరకూ మాకున్న సమాచారం ఇంతే. రేసులో ముంబై, అహ్మదాబాద్​లు ముందున్నాయి అని పార్థ్​ వెల్లడించారు.

ట్యాగ్స్​
Source: espncricinfo