సబ్ స్టిట్యూట్: ఐపీఎల్ లోనూ ఫుట్ బాల్ రూల్ ..

By udayam on December 2nd / 10:47 am IST

ప్రతి ఏటా జనరంజకంగా సాగిపోతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఓ కొత్త రూల్ తీసుకువస్తున్నారు. ఫుట్ బాల్ తరహాలో ఐపీఎల్ లోనూ ‘సబ్ స్టిట్యూట్’ విధానం ప్రవేశపెట్టేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ఇప్పటిదాకా క్రికెట్లో ‘సబ్ స్టిట్యూట్’ అంటే, ఎవరైనా గాయపడితే వారి బదులు ఫీల్డింగ్ చేయడానికి మాత్రమే ఉపయోగించేవారు. కానీ, వచ్చే ఐపీఎల్ సీజన్ తో సరికొత్త మార్పుకు శ్రీకారం చుడుతున్నారు. ఐపీఎల్ లో ‘సబ్ స్టిట్యూట్’ తో బౌలింగ్, బ్యాటింగ్ చేయించుకోవచ్చు. ఈ సబ్ స్టిట్యూట్ ను ‘ఇంపాక్ట్ ప్లేయర్’ అని పిలుస్తారు. టాస్ సమయంలో ఒక్కో జట్టు ‘ఇంపాక్ట్ ప్లేయర్’ కోటాలో నలుగురి పేర్లను ప్రకటించాల్సి ఉంటుంది.

ట్యాగ్స్​