వాతావరణ మార్పుల కారణంగా ఓ నది ఎండిపోవడంతో అత్యంత పురాతన పట్టణం ఒకటి బయటకొచ్చింది. ఇరాక్‌లోని టైగ్రిస్ నదిపై కట్టిన మోసుల్ రిజర్వాయర్‌లో నీరు తగ్గిపోవడంతో ఈ 3400 ఏళ్ళ నాటి అత్యంత పురాతన నగరం బయటపడింది. క్రీస్తు పూర్వం 1350 సంవత్సరంలో ఈ నగరం నదిలో మునిగిపోయినట్లు అధికారులు తెలిపారు. అప్పట్లో ఈ నగరం ఇండో–ఇరానియన్ మిట్టాని రాజుల పరిపాలనలో భాగంగా నిర్మించారని శాస్త్రవేత్తలు తెలిపారు.