ట్రైన్ ప్రయాణణాల్లో పక్క వారి గురించి ఆలోచిచకుండా రాత్రిళ్ళు గట్టిగా మాట్లాడడం, మ్యూజిక్ వినడం లాంటివి ఎంత చికాకు కలిగిస్తాయో తెలిసిందే కదా! దీనిపై రైల్వే శాఖ తాజాగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇకపై ట్రైన్స్ లో రాత్రి 10 తర్వాత గట్టిగా మాట్లాడినా, సంగీతం విన్నా, అరిచినా వారిపై కేసులు పెట్టనుంది. తోటి ప్రయాణికులు దీనిపై ఫిర్యాదు చేసుకునేలా ఓ ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబరును రైల్వే శాఖ విడుదల చేయనుంది. రైళ్లలో నిద్రించే వారికి ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చింది.