ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారౌతుతో బుల్లితెర క్రేజీ యాంకర్ ప్రదీప్ మాచిరాజు పెళ్ళి ఫిక్స్ అయినట్లు టాక్ నడుస్తోంది. టివి షోలు, ఈవెంట్లతో ప్రదీప్ ప్రతీ ఒక్క తెలుగు టివి ప్రేక్షకుడికీ సుపరిచితుడే. ఎప్పటి నుంచో పెళ్ళి వార్తలు వస్తన్నప్పటికీ అవి ఎప్పుడూ గట్టిగా నిలబడలేదు కూడా. అయితే ఇప్పుడు ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పెళ్ళి దాదాపు ఖాయమైనట్టేనని సైతం ప్రదీప్ సన్నిహితులు మీడియాకు లీకులు ఇస్తున్నారు.