మన దేశం నుంచి దోచుకెళ్ళిన ప్రపంచ ప్రసిద్ధ డైమండ్ కోహినూర్‌ను బ్రిటన్ తిరిగి భారత్‌కు ఇచ్చేయనుందా? ఈ ప్రశ్నకు త్వరలోనే సమాధానం దొరికే అవకాశం కనిపిస్తోంది. తాజాగా బ్రిటన్ తాము 200 ఏళ్ళ క్రితం గ్రీస్‌లోని ఏథెన్స్ నుంచి తీసుకొచ్చిన ఎల్గిన్ మార్బుల్స్‌ను తిరిగి గ్రీస్‌కు ఇచ్చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇదే క్రమంలో భారత్‌ను పాలించిన క్రమంలో అక్కడి నుంచి కొట్టేసిన కోహినూర్‌ను కూడా వారికి తిరిగి ఇచ్చేయాలా? వద్దా? అన్నదానిపై చర్చలు జరుపుతోంది.