ఇస్లామిక్ స్టేట్ (ఐసీస్) ఉగ్రవాద సంస్థ అధినేత హసన్ అల్ హషిమీ అల్ ఖురేషి హతమయ్యాడు. ఈ మేరకు ఉగ్రవాద సంస్థ ఓ ఆడియో ద్వారా ప్రకటించింది. ఇరాక్కు చెందిన హషిమి దేవుడి వ్యతిరేకులతో జరిగిన యుద్ధంలో మరణించినట్టు ఐసిస్ పేర్కొంది. అయితే, ఎప్పుడు? ఎక్కడ? అన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు.