మన సౌర కుటుంబంలో సూర్యుడి తర్వాత 2వ గ్రహంగా ఉన్న శుక్ర గ్రహంపైకి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఓ శాటిలైట్‌ను పంపడానికి సన్నాహాలు మొదలుపెట్టింది. అత్యధిక స్థాయిలో ఉష్ణోగత్రలు ఉండే ఈ గ్రహం ఉపరితలం ఎలా ఉంటుందన్న దానిపై పరిశోధనలు జరిపేందుకు ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ ప్రకటించారు. ఈ ప్రయోగానికి కావాల్సిన ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధమైందన్న ఆయన నిధుల కొరత కూడా లేదన్నారు. 2024 డిసెంబర్ నాటికి ఈ మిషన్ మొదలవుతుందని తెలిపారు.