ఎస్​ఎస్​ఎల్​వి విఫలం : సెన్సార్​ ఫెయిల్​.. కక్ష్య దాటిన ఉపగ్రహాలు

By udayam on August 8th / 4:54 am IST

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్​ఎస్​ఎల్​వి డీ1 ప్రయోగం విఫలమైంది. ఈ రాకెట్​ ద్వారా ప్రయోగించిన రెండు ఉపగ్రహాలు కూడా నిర్ధేశించిన కక్ష్యను దాటి తిరుగుతున్నాయని ప్రకటించింది. మూడు దశలను విజయవంతంగా దాటిన రాకెట్‌.. టర్మినల్‌ దశలో అదుపు తప్పింది. రెండు ఉపగ్రహాలను 356×76 కిలోమీటర్ల దీర్ఘ వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే.. ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ1 రాకెట్‌ వాటిని 356 కిలోమీటర్లు వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీంతో ఈ ఉపగ్రహాలు పనికిరావని ఇస్రో పేర్కొంది. సెన్సార్​ వైఫల్యమే దీనికి కారణమని ప్రకటించింది.

ట్యాగ్స్​