భారత అంతరిక్ష ప్రయోగాలు శుక్రవాకం కీలక టర్న్ తీసుకోనున్నాయి. చరిత్రలోనే తొలిసారిగా భారత్ కు చెందిన తొలి ప్రైవేట్ రాకెట్ ను ఇస్రో ఈ శుక్రవారం ప్రయోగించనుంది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ప్రయోగించనున్నారు. హైదరాబాద్ కి చెందిన స్పేస్ స్టార్టప్ అయిన స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన ఈ రాకెట్‌కు విక్రమ్-ఎస్ అని పేరు పెట్టారు. ఈనెల 12నే ప్రయోగించాల్సి ఉండగా.. వాతావరణం అనుకూలించకపోవడంతో 18కు వాయిదా వేశారు. ఈ రాకెట్ లో భారత్, అమెరికా, సింగపూర్, ఇండోనేషియా విద్యార్థులు తయారు చేసిన ఫన్ శాట్, స్పేస్ కిడ్జ్ శాటిలైట్లు ఉన్నాయి.