తమపై కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా దాడులు చేయిస్తోందని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. హవాలా, బ్లాక్ మనీ దందాలు చేయడం లేదని.. న్యాయబద్ధంగా కళాశాలలు నడుపుతున్నానని చెప్పారు. సూరారంలోని మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రికి తమ సమీప బంధువు ప్రవీణ్‌రెడ్డిని తీసుకుని ఆయన వెళ్లారు. ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స అందిస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ”మా కుటుంబంపై బీభత్సం చేస్తున్నారు. రాజకీయ కక్షతో దాడులు చేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. నా కుమారుడు ఇప్పటికే భయంతో వణికిపోతున్నాడు” అని ఆయన వ్యాఖ్యానించారు.