తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల నివాసాలు, కార్యాలయాల్లో మంగళవారం ఉదయం నుంచే జరుగుతున్న ఐటీ సోదాల్లో ఎట్టకేలకు మంత్రి ఫోన్ ను అధికారులు పట్టేశారు. మల్లారెడ్డి సెల్ ఫోన్ ఆయన నివాసం పక్కన ఉన్న క్వార్టర్స్ వద్ద ఓ గోనెసంచిలో దాచి ఉంచడాన్ని ఐటీ అధికారులు గుర్తించారు. ఈ సోదాల్లో మల్లారెడ్డికి వివిధ ప్రాంతాల్లో భారీ ఎత్తున ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. ఒక యూనివర్శిటీ, 38 ఇంజినీరింగ్ కాలేజీలు, రెండు మెడికల్ కాలేజీలు, స్కూళ్లు, పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్, వందల ఎకరాల భూములు ఉన్నట్టు గుర్తించారు.