రెండు రోజులపాటు మంత్రి మల్లారెడ్డి ఇల్లు , ఆఫీస్ ల ఫై జరిపినా దాడుల్లో దాదాపు రూ. 8 కోట్ల నగదు లభ్యం అయినట్లు అధికారులు తెలిపారు. భూ కొనుగోళ్లు – అమ్మకాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, మేనేజ్‌మెంట్ కోటా కింద మెడికల్ సీట్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ప్రధానంగా అధికారులు ఆరాతీస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లతో పాటు భారీగా నగదు స్వాధీనం చేసుకుంటున్నారు. మంగళవారం, బుధవారం రెండు రోజుల్లో మొత్తం రూ. 8కోట్లు 80 స్వాధీనం చేసుకున్నట్లుగా ఐటీ అధికారులు తెలిపారు. మంగళవారం ఒక్క రోజే ఐటీ సోదాల్లో రూ. 4కోట్లు 80 లక్షలు స్వాధీనం చేసుకోగా.. త్రిశూల్ రెడ్డి ఇంట్లో రూ. 2కోట్లు 80 లక్షలు, మర్రి రాజశేఖర్ రెడ్డి రూ. 2 కోట్లు లభించాయి. మంత్రి మల్లారెడ్డి భార్య తమ్ముడి కొడుకు సంతోష్ రెడ్డి నివాసంలో రూ. 4కోట్లు స్వాధీనం చేసుకున్నారు.