30 ఏళ్ళ తర్వాత కశ్మీర్​లో తెరుచుకున్న ధియేటర్లు

By udayam on September 20th / 6:02 am IST

దాదాపు 3 దశాబ్దాల తర్వాత కశ్మీర్​లో సినిమా హాల్స్​ తెరుచుకున్నాయి. ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన మల్టీపర్పస్​ ధియేటర్లను ఆ రాష్ట్ర లెఫ్టినెంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హా షోపియాన్​, పుల్వామా జిల్లాల్లో ప్రారంభించారు. దీంతో పాటు మంగళవారం ఈ రాష్ట్రంలో తొలి మల్టీప్లెక్స్​ ధియేటర్​ ప్రారంభం కానుంది. అమీర్​ఖాన్​ కొత్త చిత్రం లాల్​ సింగ్​ ఛడ్డాను ఇందులో ప్రదర్శించనున్నారు. సంస్కృతిని, విలువలను చెప్పడంలో సినిమా కంటే బలమైన శక్తి లేదు అని గవర్నర్​ చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్​