50 శాతం వాటా మహిళల హక్కు : ఎన్​వి.రమణ

By udayam on September 27th / 8:44 am IST

చట్టసభల్లో మహిళలకు 50 శాతం కోటా అనేది వారి హక్కు తప్ప దానం కాదని సుప్రీంకోర్టు చీఫ్​ జస్టిస్​ ఎన్​వి.రమణ అన్నారు. ఎప్పటి నుంచో న్యాయ స్థానాల్లో 5‌‌0 శాతం వాటా మహిళలకు ఇవ్వాలన్న డిమాండ్​కు ఆయన తాజాగా మద్దతు పలికారు. ‘వేలాది ఏళ్ళుగా మహిళలకు దక్కాల్సిన అవకాశాల్ని ఇకనైనా అందిద్దాం. 50 శాతం వాటా అనేది వారి హక్కు.. అది మనం చేసే దానం కాదు’ అని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా అన్ని లా కళాశాలల్లో 5‌‌0 శాతం వాటా మహిళలకు ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు.

ట్యాగ్స్​