జమ్మూ కశ్మీర్లో మంగళవారం ఉగ్రవాదులు విధుల్లో ఉన్న పోలీసు అధికారి సైఫుల్లా ఖాదిర్‌ను కాల్చి చంపారు. ఈ దాడిలో అతడి కూతురు కూడా గాయపడిందని పోలీసులు తెలిపారు. అయితే ఆమెకు ప్రాణాపాయం తప్పిందని కశ్మీర్ ఐజి విజయ్ కుమార్ వెల్లడించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన ఈ దాడికి పాల్పడ్డవారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. పోలీసు అధికారి మృతిపై జమ్మూ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.