పేటియం సంస్థకు చెందిన ఈకామర్స్ ప్లాట్‌ఫామ్ పేటిఎం మాల్లో చైనా కంపెనీ అలీబాబా తన వాటాలను విక్రయించింది. ఈ సంస్థలో అలీబాబాకు దాని అనుబంధ సంస్థ యాంట్ ఫైనాన్షియల్‌కు ఉన్న 43.32 శాతం వాటాను రూ.42 కోట్లకు అమ్మేసినట్లు మింట్ రిపోర్ట్ చేసింది. ఈ షేర్లను పేటిఎం ఈ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. 2020లో రూ.21 వేల కోట్లుగా ఉన్న పేటిఎం మాల్ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.100 కోట్ల కంటే తక్కువకు పడిపోవడంతో జాక్ మా తన షేర్లను వదిలించుకున్నాడు.