గత కొద్దిరోజులుగా అధిస్ఠానంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న వైకాపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపై జగన్ వేటు వేశారు. ఆయనను వెంకటగిరి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి వాటిని నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి కి అప్పగించారు. వెంకటగిరి నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతలు మరొకరికి అప్పగించారని మీడియాలో వార్తలు వస్తున్నాయని.. తాను ఎలాంటి కథనాలు మీడియాలో చూడలేదంటూ ఆనం వెల్లడించారు. అధికారిక సమాచారం వచ్చిన తర్వాత అధిష్టానంతో దీనిపై చర్చిస్తానన్నారు.