ఆప్‌ మంత్రి సత్యేందర్‌ జైన్‌ మసాజ్‌ అంశంలో మరో ట్విస్ట్‌

By udayam on November 22nd / 10:12 am IST

ఆప్‌ మంత్రి సత్యేందర్‌ జైన్‌ జైల్లో మసాజ్‌ వ్యవహారం మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. మంత్రి మసాజ్‌ చేసింది ఫిజియోథెరపిస్ట్‌ అని ఆప్‌ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, మంత్రికి మసాజ్‌ చేసింది ఫిజియోథెరపిస్ట్‌ కాదని.. పోక్సో యాక్ట్‌ కింద శిక్ష అనుభవిస్తున్న నిందితుడు రింకూ అని తీహార్‌ జైలు అధికార వర్గాలు చెప్పినట్లు సమాచారం. రింకూ లైంగిక దాడి కేసులో నిందితుడని, పోక్సో చట్టంలోని సెక్షన్ 6, ఐపీసీ 376, 506, 509 కింద అభియోగాలు నమోదయ్యాయని పేర్కొన్నారు.మరో వైపు సత్యేందర్‌ జైన్‌కు మసాజ్‌ చేసింది రేపిస్ట్‌ అని బీజేపీ నేత షాజాద్‌ పూనావాలా ట్వీట్‌ చేశారు.

ట్యాగ్స్​