భారీ ఉగ్రకుట్ర భగ్నం

నలుగురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన సైన్యం

అత్యవసర సమావేశం నిర్వహించిన మోదీ

By udayam on November 20th / 1:38 pm IST

దేశంలో భారీ ఉగ్రకుట్రకు ప్లాన్​ చేసిన పాక్​కు చెందిన జైషే ఇ మహమ్మద్​ కు చెందిన నలుగురు ఉగ్రవాదుల్ని జమ్మూ శివార్లలో మట్టుబెట్టినట్లు జాతీయ మీడియా పేర్కొంది. దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి హోం మంత్రి అమిత్​ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ దోవల్​, సీనియర్​ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోదీ భద్రతా దళాలు, ఇంటెలిజెన్స్​ వర్గాలు కలిసి ఈ దాడిని సమర్ధవంతంగా అడ్డుకున్నాయని అభినందించారు. 2008లో 26‌/11 ధాఢులు జరిగిన రోజునే తిరిగి అలాంటి భారీ దాడికి ప్రయత్నిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేసి వీరిని అంతమొందించినట్లు ఇంటెలిజెన్స్​ వర్గాలు వెల్లడించాయి.

ఈరోజు తెల్లవారుఝాము 4.20 గంటలకు జరిగిన ఈ దాడిలో 11 ఎకె 47 రైఫిల్స్​, మూడు పిస్టోల్స్​, 29 గ్రెనేడ్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.