హరియాణాలోని టోహానాకు చెందిన ప్రముఖ స్వామీజీ జిలేబీ బాబాకు 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. మహిళలపై లైంగిక వేధింపుల కేసులో ఆయనకు ఈ శిక్ష విధించారు. ఈ కేసులో జిలేబీ బాబా ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. అమర్‌పురి అలియాస్ బిల్లూ అలియాస్ జిలేబీ బాబాకు ఫతేహాబాద్‌లోని అడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి శిక్షను ఖరారు చేశారు. ఈనెల 5నే కోర్టు ఈయనను దోషిగా తేల్చి ఈరోజు శిక్షను ఖరారు చేసింది. అభ్యంతరకర వీడియోలు తీస్తూ మహిళలను బ్లాక్‌మెయిల్ చేసేవాడని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.